# భగవంతుడు ఎప్పుడూ చెడు చెయ్యడు 🙏🏽😇 #bhagavadgita #krishna #god

## Метаданные

- **Канал:** Manasa Mandavilli
- **YouTube:** https://www.youtube.com/watch?v=N9SxvarwsNM
- **Дата:** 28.03.2026
- **Длительность:** 2:01
- **Просмотры:** 724,020
- **Источник:** https://ekstraktznaniy.ru/video/50485

## Транскрипт

### Segment 1 (00:00 - 02:00) []

నేను ఇప్పుడే శ్రీమద్భాగవతం చదువుతూ ఉన్నాను అన్నమాట. అయితే ఒక అద్భుతమైన శ్లోకం కనిపించింది పద్మ పురాణం నుంచి ఈ శ్లోకాన్ని తీశారు అయితే ఈ శ్లోకం అర్థం ఏంటి అంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే భక్తులకి భగవంతుడు చేసిన పనులు తప్పుగా అనిపిస్తాయి అంటే నాకు చెడు చేశడు భగవంతుడు అని అనిపిస్తుంది. అయినా కూడా మనం భగవంతుని తప్పు పట్టకూడదు కేవలం భక్తుడికి దూరదృష్టి లేకపోవడం వల్ల భక్తుడికి మనంట బిగ్ పిక్చర్ అని భక్తుడికి పాస్ట్ తెలీదు ఫ్యూచర్ తెలీదు కాబట్టి మనం ప్రెసెంట్ లో ఉండి అయ్యో ఇలా జరిగిపోయింది ఏంటి అనుకొని భగవంతుని నిందించడం మొదలు పెట్టకూడదు మన బుద్ధి సరైంది కాదు కదా మనకి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఉన్నాయి రాగ ద్వేషాలు ఉన్నాయి మన బుద్ధి బ్రష్టు పట్టుకుపోయిఉంది కాబట్టి మనకి మొత్తం జ్ఞానం లేదు కాబట్టి భగవంతుడు చేసిన కొన్ని పనులు కొన్ని సార్లు మనకి చెడుగా అనిపిస్తాయి మనకు అనిపిస్తాయి కానీ నిజంగా చెడు కాదు భగవంతుడు ఎప్పుడు ఎవ్వరికీ ఏ చెడు చేయడు ఈ సందర్భంలోనే నేను ఎప్పుడో ఒక స్టోరీ గుర్తు చేసుకుంటూ ఉంటాను ఒక వ్యక్తి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో నుంచుని రోడ్డు వైపు చూస్తున్నాడు. ఆ రోడ్డు పైన రెండు దృశ్యాలు కనిపిస్తున్నాయి ఆ వ్యక్తికి అదేంటి అంటే ఓ చిన్న పాప సైకిల్ నడుపుకుంటూ వెళ్తుంది ఓ రోడ్డు మీద ఇప్పుడు వేరే లారీ బ్రేక్స్ ఫెయిల్ అయిపోయిన లారీ అదే రోడ్డు పై నుంచి స్ట్రెయిట్ గా వస్తుంది. ఆ అమ్మాయిని గుద్దేసే స్టేజ్ లో ఉంటుంది అమ్మాయి ఏమో మంచిగా చిన్నగా సైకిల్ నడుపుకుంటూ వెళ్తుంది. అనుకోకుండా సైకిల్ రాయికి తగిలి సైకిల్ పక్కకు పడిపోయి అమ్మాయి పక్కకు పడిపోతుంది అయ్యో దెబ్బ తగిలింది అని అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. కానీ దాని వల్ల ఏం జరుగుతుంది అదైతే లారీ ఉందో ఆ లారీ నుంచి తప్పించుకుంటుంది ఆ అమ్మాయి ఇదంతా ఆ చిన్న పాపకు కనిపించ చిన్న పాప ఏమనుకుంటుంది నాకు దెబ్బ తగిలిందా అయ్యో దెబ్బ ఎందుకు తగిలింది దేవుడా అని అనుకుంటుంది. కానీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తున్న వ్యక్తికి ఆ రెండు దృశ్యాలు కనిపించినప్పుడు అర్థమవుతుంది ఆ చిన్న పిల్ల అక్కడ సేవ్ అయింది అని అలానే భగవంతుడు ఎప్పుడు మనుషులకి చెడు చేయడు ఏం చేసినా మనం మంచికే మనక అది ఇప్పుడు చెడులా కనిపించినా దాంట్లో ఏదో మంచి ఉంటుంది రాధే
